ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం > గోంగూరతో ఐరన్ ప్రాప్తి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గోంగూరతో ఐరన్ ప్రాప్తి
గోంగూర పచ్చడికి ప్రత్యేక స్థానం ఉన్న విషయం అందరి తెలిసిందే. తెలుగువారి ప్రముఖ వంటకాల్లో మొదటి స్థానం గోంగూరదే. గోంగూర పచ్చడి కనిపించగానే లొట్టలేసుకుని తినే వారు అధికంగా ఉన్నారు. ఇందులో చాలా ఔషదగుణాలున్నాయి.

ఐరన్ లోపం ఉన్నవారు గోంగూరను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒంటిపై వేడిగడ్డలు ఉన్న వారు గోంగూరను ఉడికించి గడ్డలపై కడితే అవి త్వరగా పగిలిపోతాయి. రేచీకటి ఉన్నవారు గోంగూరను బాగా ఉడికించి కషాయాన్ని తీయాలి. ఈ కషాయానికి తేనె లేదై పంచదార లేదా బెల్లం కలిపి తీసుకోవడం మంచిది. ఫలితంగా రేచీకటి తగ్గుతుంది.

దగ్గు, ఆయాసం, తీవ్ర జ్వరం, గోంగూరను తీసుకోకపోవడం మంచిది. అలాగా శరీర రుగ్మతలున్న వారు కూడా గోంగూరను తినకూడదు. గోంగూరకు వేడి చేసే గుణం ఉంది, కాబట్టి శరీర వేడి అధికంగా ఉన్నవారు మితంగా తీసుకోవడం మంచిది.
మరిన్ని
పొట్లకాయతో మధుమేహం నియంత్రణ
కాకరలోని ఆరోగ్య నిజాలు
అపస్మారకానికి కుంకుడు చికిత్స
ఖర్జూరం ఓ దివ్య ఔషదం
రాగితోనే శారీరక దారుఢ్యం
జలుబుకు శొంఠి శ్రేష్టం