ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం > సకల రోగాల నివారిణి "తులసి"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సకల రోగాల నివారిణి "తులసి"
FileFILE
పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చని మన బామ్మలు చెప్పిన మాటలను అక్షర సత్యాలనవచ్చు. ఎందుకంటే తులసిలో ఉండే ఔషద గుణాలు సకల రోగాలను నివారిస్తాయి కాబట్టి. ఆరోగ్యపరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. లక్ష్మి తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా పిలువబడే ఈ తులసి వల్ల మనకు కలిగే లాభాలేంటో తెలుసుకుందామా..?!

మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు తులసి ఆకులతో తయారు చేసిన కషాయం తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఈ ఆకులతో ఆవిరి పట్టినా, వాసన చూసినా మంచి ప్రభావం కనిపిస్తుంది. ఇలా చేయడాన్నే ఆరోమా థెరపీ అంటారు.

నీడన ఆరబెట్టిన తులసి ఆకులను పొడి చేసి, ఒక టీస్పూన్ పొడికి, చిటికెడు సైంధవలవణం చేర్చి పళ్ళు తోముకుంటే పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యల్ని నివారించుకోవచ్చు. తులసి రసంలో కాస్త నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మ సంబంధ సమస్యలు మటుమాయమవుతాయి.

తులసి ఆకుల పొడిని పెసరపిండిలో కలిపి ఒంటికి రాసుకొని స్నానం చేస్తే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. మొటిమలు తొందరగా తగ్గుతాయి. తులసి ఆకుల కషాయం జ్వరం తీవ్రతను తగ్గిస్తుంది. వర్షాకాలంలో మలేరియా వంటి వైరల్ జ్వరాలకు తులసిని మంచి విరుగుడుగా చెప్పుకోవచ్చు.

తులసి కషాయంలో ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే, జ్వరంతో బాధపడేవారి అధిక దాహం సమస్యను నివారిస్తుంది. వీటి ఆకులతో అవిరి పడితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి కషాయం, అల్లం రసం సమపాళ్ళలో కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.

ఏడాది నిండిన పిల్లలకు రోజూ ఒక చెంచా తులసి రసం తాగిస్తే జీర్ణ శక్తి పెరుగుతుండి. పిల్లలకు తరచూ జలుబు, దగ్గు, జ్వరాలు రాకుండా కాపాడుకోవచ్చు. కళ్ళు మండుతున్నా, ఎరుపెక్కినా కషాయం పలుచగా చేసి కళ్ళు కడిగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆరోగ్య ప్రధాయిని "తేనె"
"అమ్మలాంటి నిమ్మ"తో చక్కనైన ఆరోగ్యం
సర్వ సుగుణాల మొక్క "పుదీనా"
జీర్ణవ్యవస్థకు మేలు చేసే బొప్పాయి
కొత్తిమీరతో వాంతులకు చెక్
గోంగూరతో ఐరన్ ప్రాప్తి