చెవి నొప్పి అలర్జీ వలన వస్తుంది. లేదా చెవిలో ఏదైనా ఇతర చిన్న ప్రాణి ప్రవేశించినా, ఇన్ఫెక్షన్ ఏర్పడ్డాకూడా చెవి నొప్పి వస్తుందంటున్నారు వైద్యులు. నొప్పిని నివారించడానికి కొన్ని చిట్కాలు మీ కోసం అంటున్నారు వైద్యులు. ఇది వైద్యుడ్ని సంప్రదించేలోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ** పడుకున్నప్పుడు చెవిలో నొప్పి అధికంగావుంటే తలను కాస్త నిటారుగా ఉంచి కూర్చోండి. ** నొప్పి వచ్చిన సందర్భంలో చూయింగ్ గమ్‌ను నమలండి. దీంతో చెవిలోనున్న యూస్టాచియాన్ ట్యూబ్ కాస్త తెరుచుకుని నొప్పి తగ్గి కాస్త ఉపశమనం కలగుతుంది. యూస్టాచియాన్ ట్యూబ్ చెవి, ముక్కు, గొంతుకు సంబంధం ఉందంటున్నారు వైద్యులు. ** చల్లటి పదార్థాలను తీసుకోవడం మానేయండి. ** చెవిని ఎప్పుడూకూడా చెమ్మగా ఉంచకండి. స్నానం చేసే ప్రతిసారి మీ చెవులను దూదితో నింపండి. ** చెవినొప్పిని నివారించడానికి "బాలతైలం" ఆయుర్వేద మందును చెవిలో పోయండి. నొప్పితగ్గి కాస్త ఉపశమనం కలుగుతుంది. ** చెవి చుట్టూ జాజికాయతో చేసిన నూనెను పూయండి. దీంతో నొప్పి తగ్గుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. |