చుండ్రు వలన వెంట్రుకలు తెల్లబడటం, వెంట్రుకలు బలహీనపడటం, తలలో నవ్వ తదితర సమస్యలు తలెత్తుతుంటాయి. చాలావరకు రకరకాల షాంపూలు వాడినంత వరకే ఉపశమనం కలుగుతుంటతుంది. మళ్ళీ యథావిధిగా ఈ సమస్య తలెత్తుతుంటుంది.
మనకు ప్రకృతి ఇచ్చిన అనేక పదార్థాలు ఒక వరం లాంటిది. వీటి వాడకం వలన సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉండదు. అలాంటి చిట్కాలు మీకోసం. వీటిని వాడి మీ వెంట్రుకలను నల్లగా, మెరిసేలా, చుండ్రునుంచి ఉపశమనం కలిగేలా చేసుకోండి.
** ఒక కప్పు నీటిలో అర చెంచా నిమ్మ రసం కలిపి తలకు పట్టించండి. నెలకు రెండు సార్లు ఇలా చేస్తే మెలమెల్లగా చుండ్రు మటుమాయం అవుతుంది.
** రాత్రి పూట కొబ్బరినూనెలో నిమ్మ రసం కలిపి తలకు దట్టించి మాలిష్ చేయండి. తెల్లవారిన తర్వాత తల స్నానం చేయండి. దీంతో చుండ్రు మాయం.
** తాజా కొబ్బరిపాలను వడగట్టి దానిని తలకు పట్టించండి. మరుసటిరోజు తలస్నానం చేయండి.
** యూకలిప్టస్ నూనె చుక్కలు కొన్ని కొబ్బరినూనెలో కలిపి తలకు మాలిష్ చేయండి.
** కొబ్బరినూనెను గోరు వెచ్చగా వేడి చేసి అందులో ఒక వెల్లులి పాయ, ఒక చెంచా నువ్వుల నూనె కలిపి కొద్దిసేపు అలాగే ఉంచండి. ఆ తర్వాత ఈ నూనెను తలకు పట్టించండి. దీంతో చుండ్రు మటుమాయమై వెంట్రుకలు దట్టంగా పెరగడమే కాకుండా నల్లగా నిగనిగలాడుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. |