ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం > నిద్రలేమితో బాధపడుతున్నారా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నిద్రలేమితో బాధపడుతున్నారా...!
Gulzar Ghouse
Content consultent
FILE
** రాత్రి భోజనం చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలపాటు నడక ప్రారంభించండి. ఆ తర్వాత పడకవైపు ప్రయాణం చేయండి. దీంతో మంచిగా నిద్ర పట్టడమే కాకుండా జీర్ణక్రియకూడా పెరగుతుంది.

** మీలోనున్న ఒత్తిడికారణంగా నిద్ర రాకపోతే లేదా మనసులో అలజడి కారణంగాకూడా నిద్ర రాదు. అలాంటి పరిస్థితుల్లో మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి లేదా మంచి సాహిత్యం చదవండి లేదా ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలను చదవండి. ఇలా చేస్తే మనసు కాస్త కుదుటపడి గాఢమైన నిద్ర రావడానికి ఆస్కారం ఉంటుంది.

** మీరు పడుకునే మంచం లేదా పడక ఏదైనాకావచ్చు మీకు నచ్చిన రీతిలో ఉండే విధంగా తయారుచేసుకోండి. మీకు ఇష్టమైన పడకనే ఏర్పాటు చేసుకోండి. లేకుంటే నిద్రలో తేడాలొచ్చి మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు వైద్యులు.

** నిద్రలేమితో బాధపడుతుంటే మీ ముఖం, కాళ్ళు, చేతులు చల్లటి నీటితో కడుగుకోండి. దీంతో నిద్ర తప్పక వస్తుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బజార్లో దొరికే సువాసన నూనెలను ప్రయోగించకండి. వీటివలన మీ ఆరోగ్యం పాడైయ్యే ప్రమాదం ఉంది.

** పడుకునేముందు రోజంతా చేసిన పనిని మర్చిపొండి. మరుసటి రోజు చేయవలసిన పనిని గురించి ఏమాత్రం ఆలోచించకండి. అన్ని విషయాలను ఉదయం వరకు మర్చిపొండి. మరుసటి రోజు పనిగురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరిగి నిద్ర పట్టదంటున్నారు వైద్యులు.

** ఒకవేళ మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, నిద్రమాత్రలు వాడుతుంటే మీరు యోగా నిపుణులను సంప్రదించండి. వారి సలహాలు పాటించి శ్వాసక్రియను పాటించండి. రాత్రి పడుకునేముందు శ్వాసను పూర్తిగా తీసకోండి. దీంతో మీ మస్తిష్కానికి ప్రాణావయువు చేరి మీకు నిద్ర సంపూర్ణంగా వస్తుంది.

** మంచి నిద్రకు మీ గదిలో గాలి సౌకర్యం బాగుండాలి. పడుకోవడానికి బయటి వాతావరణం అనుకూలంగా ఉంటే గది బయట పడుకోండి లేదా పైకప్పుపై పడుకోండి. మీ గదిలో కూలర్, ఫ్యాన్ లేదా ఎయిర్ కండీషనర్ శబ్దం ఎక్కువగా ఉంటే వాటిని రిపేరు చేయించండి. ఎందుకంటే శబ్దాలవలనకూడా నిద్ర రాదు.

** నిద్రపోయేముందు టీ- కాఫీల్లాంటివి వాడకండి. దీంతో మస్తిష్కంలోని సిరలు ఉత్తేజం చెంది నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చుండ్రును తరిమి కొట్టండిలా...!
జీర్ణశక్తి లోపించిందా...తోటకూర తీసుకోండి
ఎసిడిటీని దూరం చేయండిలా...!
చెవి నొప్పిగావుందా...!
భోజనం రుచించడాంలేదా...?
మధుమేహ నివారణలో ఔషధ మొక్కలు