రక్తంలో చక్కెరశాతాన్ని పెంచేది స్వీట్లేనని "స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్"కు చెందిన శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదమని రక్తంలో ఫ్రీ రాడికల్స్‌ను సునాయాసంగా పెంచేస్తాయని వారు వివరించారు.
దీంతో రక్తనాళికల్లోని పొరలు దెబ్బతింటాయి. అంతేకాకుండా శరీరంలోని ఇతర భాగాలనుకూడా నష్టపరుస్తుంది. రక్తనాళాలలో ఈ ఫ్రీరాడికల్స్ "ఇంజ్యూరీ" వలన వాపు కలుగుతుందని కాబట్టి స్వీట్లు అధికంగా తీసుకోకూడదని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.
వీటిలో "ప్లాక్"(మురికి )చేరుకుంటుంది. తత్ఫలితంగా రక్తనాళాలు అతి సన్నగా కుచించుకుపోయి హృదయానికి సంబంధించిన జబ్బులను పుట్టిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వలన శరీరాన్ని కాపాడుకోవాలి. వీటిని నిరోధించడానికి చక్కెరశాతం తక్కువగానున్న ఆహారం తీసుకుంటే చాలా ఉత్తమం అంటున్నారు పరిశోధకులు. |