వైట్, ఎల్లో, బ్లాక్ టీ... ఈ కోవకు చెందినదే గ్రీన్ టీ. అయితే వీటన్నింటిలో గ్రీన్ టీ మాత్రమే అత్యంత శక్తివంతమైనది. అందుకే సంప్రదాయ వైద్యంలో ఈ టీ వాడకం భారత్, చైనా దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా ఇందులోని ఇజీసీజి అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది.
ఈ టీ తాగినవారిలో అన్నవాహిక క్యాన్సర్ తగ్గినట్లు చైనా పరిశోధనలు చెపుతున్నాయి. దీనికున్న యాంటీ ఆక్సిడేటివ్, యాంటి ప్రొలిఫరేటివ్ గుణాలే ఇందుకు కారణం.
గ్రీన్ టీ హెచ్ఐవీలోని కణాలను ఇతర ఆరోగ్యకరమైన కణాలతో కలవనీయవని జపాన్ పరిశోధకులు చెపుతున్నారు.
అంతేకాదు గ్రీన్ టీ తాగేవారిలో వృద్ధాప్య లక్షణాలు అంత త్వరగా దరిచేరవు. ఆయుష్షును పెంచే గుణం గ్రీన్ టీకి ఉన్నదంటున్నారు.
కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి హృద్రోగాలను దూరం చేస్తుంది. హృద్రోగాలు వచ్చినవారిలో కూడా గండె కణాలను బాగు చేస్తుంది. |