ప్రస్తుతం నగరాలు, పట్టణాలలో నివసించేవారి జీవితం ఉరుకులు పరుగులతోకూడుకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరుకూడా తమ జీవితంలో ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడిని తొలగించుకునేందుకు రకరకాల అలవాట్లబారిన పడుతుంటారు.
అలాంటివారికి ఒత్తిడినుంచి ఉపశమనం కలగాలంటే నిత్యం తమ ఆహారంలో పెరుగు, మొలకెత్తిన విత్తనాలను ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంటున్నారు వైద్యులు. వీటిలో అత్యధికమైన విటమిన్లు, పోషక పదార్థాలుంటాయి.
వీటితోపాటు, క్యాల్షియం, మెగ్నీషియం, ఇతర ఖనిజపదార్థాలున్న కూరగాయలను ఆహారంగా తీసుకుంటే ఒత్తిడినుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. |