** ముక్కునుంచి రక్తం కారుతుంటే గడ్డినుంచి తీసిన రసంలో ఒక చెంచా తేనెను కలిపి రోగికి ఇవ్వాలి. అలాగే గడ్డినుంచి తీసిన రసం ముక్కులో వేస్తేకూడా ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు.
** తరచూ ముక్కునుంచి రక్తం కారుతుంటే దానిమ్మ పూలనుంచి తీసిన రసం, మామిడి ముట్టినుంచి తీసిన రసం, ఉల్లిపాయ రసాన్ని ముక్కులో వేస్తే ఫలితం ఉంటుంది.
** రోగికి విశ్రాంతినిచ్చిన తర్వాత అతనికి మట్టి వాసన చూపించాలి. ఇలా చేస్తే ముక్కునుంచి రక్తం కారడం తగ్గి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
** కాసింత నీటిలో పటిక పొడిని కలిపి ముక్కులో చుక్కలుగా వేస్తే ఫలితం ఉంటుంది.
** ద్రాక్ష రసంలోని ఐదు చుక్కలు ముక్కులో వేస్తే ముక్కునుంచి రక్తం కారడం తగ్గుతుంది.
** ముక్కునుంచి రక్తం కారడం తరచూ వేసవి కాలంలోనే జరుగుతుంది. దీంతో వీలైతే గుండు గీయించి ఆ గుండుపై ఆవు నెయ్యిని పూస్తే ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు.
** నుదుటిపై ఎరుపు లేదా పసుపు వర్ణంలోనున్న చందనం, ముల్తానీ మట్టిని కలిపి లేపనంలాగా పూస్తే వేడివలన ముక్కునుంచి రక్తం కారుతుంటే ఉపశమనం కలుగుతుంది. |