హృద్రోగంతో బాధపడేవారికి నిత్యం తక్కువ కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోమని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. ఇలాంటి సందర్భంలో వీరి ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు తగ్గిపోతాయి. దీంతో గుండెకు అందవలసిన శక్తి సరిగా అందదు.
ఈ విధంగాకూడా వారిలో ఈ వ్యాధి ఎక్కువయ్యే సూచనలు కనపడుతాయి. కాబట్టి వీరికి ఆపిల్, దానిమ్మపండ్ల రసాలు, ఉసిరికాయలాంటి పండ్లను ఆహారంగా ఇవ్వాలంటున్నారు వైద్యులు.
ఈ ఆహార పదార్థాలను తీసుకున్నాకూడా గుండెకు బలాన్ని చేకూరుస్తాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే గుండె సక్రమంగా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. |