ఎసిడిటీని దూరం చేసుకోవాలనుకుంటే నిత్యం క్యారెట్, క్యాబేజీ, గుమ్మడికాయ, కలకండ, ఆపిల్, పైనాపిల్‌ను నిత్యం తీసుకుంటుంటే ఎసిడిటీ బారిన పడినవారికి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
మధ్యాహ్నం భోజనానికి అరగంటముందు ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయ రసంతోపాటు అర చెంచా కలకండను కలుపుకుని సేవిస్తే తప్పక ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. అలాగే ఉసిరికాయ చూర్ణం ఉదయం, సాయంత్రం రెండుపూటలా తీసుకుంటుండాలి.
రెండుపూటలా తీసుకునే ఆహారానికి మధ్యలో కాస్త విరామం ఉండేలా చూసుకోండి. మానసికమైన, శారీరకమైన ఒత్తిడితోబాధపడుతుంటేకూడా ఎసిడిటిబారిన పడే అవకాశం ఉంది. దీనినుంచి ఉపశమనం పొందేందుకు ప్రాణాయామం, ధ్యానం చేయండి. దీంతో ఎసిడిటీనుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. |