ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం > అద్భుతమైన సెక్స్ టానిక్‌ "ఉల్లిపాయ"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అద్భుతమైన సెక్స్ టానిక్‌ "ఉల్లిపాయ"
FILE
"ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని" అంటుంటారు. ఉల్లిలో ఆహార విలువలు ఎన్నో ఉన్నాయి కాబట్టే, ఆ నానుడి అలా వాడుకలోకి వచ్చి ఉంటుంది. అనేక వైద్య గుణాలను తనలో దాచుకున్న ఉల్లిని పూర్వం ఈజిప్టు వైద్యులు వివిధ రోగాలకు విరుగుడుగా వాడేవారట.

ఉల్లి విత్తనాలు వీర్యాన్ని పెంచడంలోనూ దంత సంబంధ క్రిముల్ని నాశనం చేయడంలోనూ సహాయపడతాయి. మూత్ర సంబంధ వ్యాధుల్ని నయం చేస్తాయి. ఉల్లికాడలో 'ఎ' విటమిన్‌ లభిస్తుంది. జలుబు, దగ్గు, బ్రాంకైటిస్‌, ప్లూలాంటి జబ్బులకు ఉల్లి చాలా మంచిది. తేనె, ఉల్లి రసాన్ని సమపాళ్లలో కలిపి రోజూ మూడు స్ఫూన్ల చొప్పున తీసుకుంటే చలికాలంలో జలుబు మన దరికి రాకుండా వుంటుంది.

FILE
గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది. ఉల్లిపాయ రక్తంలోని కొలెస్టరాల్‌ని తగ్గిస్తుంది. పంటినొప్పితో బాధపడే వాళ్లు ఆ పంటికి లేదా చిగురుకు చేరువలో చిన్న ఉల్లిగడ్డను ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది. ఉల్లిలోని ఐరన్‌ని మనశరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్లకు ఉల్లిపాయ చాలా మంచిది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచటంలో వెల్లుల్లి తర్వాత ఉల్లి రెండో స్థానంలోకి వస్తుంది. ఇది సెక్సు కోర్కెను పెంచటమే కాకుండా జననేంద్రియాలను పటిష్టం చేస్తుంది కూడా. తెల్ల ఉల్లిని పొరలుగా చీల్చి, దంచి, వెన్నతో కలిపి వేయించుకుని ఒక టీస్పూన్ తేనెతో కలిపి ఖాళీ కడుపుతో ఆ మిశ్రమాన్ని క్రమంగా తీసుకుంటే అది అధ్బుతమైన సెక్సుటానిక్‌గా పనిచేస్తుంది.

పైల్స్‌తో బాధపడుతున్న వారు 30 గ్రాముల ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లలో వేసి, అందులో 60 గ్రాముల పంచదార కలుపుకుని రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఉపశమనం లభిస్తుంది. చెవులు గింగురుమంటున్నప్పుడు ఉల్లిరసాన్ని దూది మీద పిండి ఆ దూదిని చెవిలో ఉంచుకుంటే మంచిది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎసిడిటీని దూరం చేయండిలా...
కీళ్ళ వాతంతో బాధపడుతుంటే...!
హృద్రోగానికి పండ్లే మందులు
మధుమేహాన్ని అదుపులో ఉంచండిలా...!
శరీరంలోని కొవ్వును అదుపులో ఉంచుకోండిలా...!
ఆకలి లేదా...? జామ ఆకులు నమలండి