ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం > బరువు తగ్గాలనుకుంటే ఆపిల్ తినండి !
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బరువు తగ్గాలనుకుంటే ఆపిల్ తినండి !
తమ శరీర బరువు తగ్గాలనుకునేవారు రోజుకు మూడు ఆపిల్ పండ్లను ఆహారంగా తీసుకుంటే కొద్ది రోజులలోనే బరువుతగ్గి నాజూకుగా తయారవుతారని వైద్యులు సూచిస్తున్నారు.

బరువు తగ్గాలనుకునేవారిపై తాము నిర్వహించిన పరిశోధనల్లో వారికి ఉదయం, మధ్యాహ్నం రెండుపూటలా అల్పాహారానికిముందు, అలాగే భోజనానికి ముందు కేవలం ఆపిల్ పండ్లను ఆహారంగా ఇచ్చామని, దీంతో కేవలం ఒక వారంలోనే వారి బరువు అరకిలో తగ్గిందని వాషింగ్‌టన్‌కు చెందిన డైటీషియన్ టామీ ఫిలమ్ అన్నారు.

దీంతో అతనివద్దకు వచ్చేవారికి ఇదే ఫార్ములాను ఉపయోగించడంతో ప్రతి ఒక్కరిలోకూడా మూడింతల బరువు తగ్గినట్లు వారి పరిశోధనల్లో తేలిందని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా ఆపిల్ పండు ఆరోగ్యానికి ఆదర్శవంతమైన పండు అని ముంబైకి చెందిన ఆహార నిపుణుడు నైనీ శీతలవాడ్ తెలిపారు. ఆపిల్ పండులో జీరోశాతం కొవ్వు, తక్కువశాతం చక్కెర ఉండటంమూలాన మధుమేహ రోగులకు ఎంతో లాభదాయకమని ఆయన అన్నారు.

ఈ పండును భోజనానికి ముందు తింటే ఆకలివేయదు. పైగా ఇది శరీర బరువును నియంత్రిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి బరువు తగ్గేవారు ఇకపై భోజనానికి ముందు ఆపిల్ తీసుకుంటారు కదూ...
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అద్భుతమైన సెక్స్ టానిక్‌ "ఉల్లిపాయ"
ఎసిడిటీని దూరం చేయండిలా...
కీళ్ళ వాతంతో బాధపడుతుంటే...!
హృద్రోగానికి పండ్లే మందులు
మధుమేహాన్ని అదుపులో ఉంచండిలా...!
శరీరంలోని కొవ్వును అదుపులో ఉంచుకోండిలా...!