ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం > వయసు పెరిగేకొద్దీ ఎండ అవసరం...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వయసు పెరిగేకొద్దీ ఎండ అవసరం...!
FILE
మనిషి వయసు పెరిగేకొద్దీ శరీరానికి ఎండ చాలా అవసరం అని తాజా పరిశోధనల్లో తేలింది. వయసుపైబడినవారి శరీరంలో విటమిన్ డీ శాతం తగ్గిపోతుందని, దీనికిగాను వారు రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఎండలో కాసేపు విహరిస్తుంటే వారి శరీరానికి కావలసి విటమిన్ డీ ఎండ ద్వారా లభిస్తుందని వైద్యులు తెలిపారు. దీంతో వారు గుండెపోటు, మధుమేహం వ్యాధిబారినపడరని వైద్యులు సూచిస్తున్నారు.

సూర్యుని కిరణాలద్వారా శరీరానికి కావలసిన విటమిన్ డీ పుష్కలంగా లభిస్తుందని వారు సూచించారు. వయసు పెరిగే కొద్దీ వారి జీవనశైలిలో మార్పులతోపాటు విటమిన్ డీకూడా తగ్గపోతుందంటున్నారు వైద్యులు.

సాధారణంగా వృద్ధులు ఎండలో బయటకు వెళ్ళేందుకు ఎక్కువగా ఇష్టపడరు. అందునా వెళ్ళవలసి వస్తే శరీరంచుట్టూ దుస్తులు ధరించి ఎండబారిన పడకుండా వెళుతుంటారు.

దీంతో సూర్యరశ్మిద్వారా శరీరానికి అందవలసిన విటమిన్ డీ వీరికి తగినపాళ్ళలో అందదంటున్నారు వైద్యులు. కాబట్టి వయో వృద్ధులు ఉదయం, సాయంత్రంవేళల్లో తేలికపాటి వ్యాయామం చేస్తూ ఉండండి. దీంతో ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్యులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
బరువు తగ్గాలనుకుంటే ఆపిల్ తినండి !
అద్భుతమైన సెక్స్ టానిక్‌ "ఉల్లిపాయ"
ఎసిడిటీని దూరం చేయండిలా...
కీళ్ళ వాతంతో బాధపడుతుంటే...!
హృద్రోగానికి పండ్లే మందులు
మధుమేహాన్ని అదుపులో ఉంచండిలా...!