** కామశక్తిని పెంపొందించుకోవాలనుకునేవారికి శుభవార్త...! ప్రతిరోజూ భోజనం ముగించిన వెంటనే అరటిపండును తింటే వారిలో వీర్యవృద్ధి కలుగుతుంది. దీంతో శరీరంలో కామశక్తి పెరుగుతుందంటున్నారు వైద్యులు. ** ముందుగా అరటిపండు తినండి. ఆ తర్వాత ఒక గ్లాసు పాలలో ఒక చెంచా నెయ్యి, కాసింత యాలకులపొడి కలుపుకుని సేవించండి. ఇలా నిత్యం సేవిస్తుంటే శరీరం బలిష్టంగా మారడమే కాకుండా వీర్యవృద్ధి జరిగి మేధోసంపత్తి పెరుగుతుందంటున్నారు. దీంతోపాటు కామశక్తికూడా పెరుగుతుంది. అలాగే స్త్రీల జబ్బులతో బాధపడుతున్న వారికికూడా ఇది ఓ దివ్యౌషధమంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రతి రోజూ రెండు అరటి పండ్లు తింటే శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు, క్యాలరీలు లభిస్తాయి. ప్రతిరోజు ఉదయంపూట రెండు అరటిపండ్లు తిని వేడి వేడి పాలను సేవిస్తే నిత్య యవ్వనులుగా ఉంటారంటున్నారు వైద్యులు. అరటిపండ్లలో చుక్కలున్న అరటపండ్లు, పలుచటి తోలు కలిగిన అరటిపండ్లను తింటే ఆరోగ్యానికి లాభదాయకంగా ఉంటుంది. భోజనానంతరం ప్రతి రోజూ రెండు అరటి పండ్లు తింటే జీర్ణక్రియ పెరగడమే కాకుండా శరీరం పుష్టిగా మారుతుందంటున్నారు వైద్యులు. |