కడుపులో నులిపురుగులుంటే ప్రతిరోజు రోగికి రెండు ఆపిల్ పండ్లు ఆహారంగా ఇవ్వండి. లేదా ప్రతిరోజు ఉదయంపూట ఆపిల్ రసాన్ని(జ్యూస్) ఇవ్వండి. దీంతో నులిపురుగులు చచ్చిపోయి మలంద్వారా బయటకు వచ్చేస్తాయి. రోగికి ఉపశమనం కలుగుతుంది. ఆకలి బాగా వేస్తుంది.
కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఇబ్బంది కలుగుతుంటేకూడా ఆపిల్‌తోపాటు దాదాపు 10గ్రాముల లవంగాలు నమిలి తినండి. ఇలా పదిరోజులపాటు చేయండి. ఆ తర్వాత మూడు లవంగాలు కలిపి ఆపిల్ పండును తినండి.
రోగికి ఇలాంటి ఆహారం ఇస్తున్న రోజులలో బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు ఇవ్వకూడదు. ఇలా నిత్యం ఆపిల్ పండును తింటుంటే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ బయటకు వచ్చేస్తుందంటున్నారు వైద్యులు. |