కడుపు పై భాగంలో నొప్పిగా ఉంటే మూడు చుక్కల పిప్పర్‌మెంట్ నూనె, రెండు చుక్కల లవంగ నూనె మరియు ఒక చుక్క యూకలిప్టస్ నూనెను కలుపుకోండి. ఇందులో ఒక చెంచా వెజిటబుల్ నూనె కలపండి.
ఈ మిశ్రమాన్ని ఉదరంపై మాలిష్ చేస్తే ఫలితం ఉంటుంది. కడుపు నొప్పినుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్పేద వైద్య నిపుణులు.
అదే కడుపు క్రింది భాగంలో నొప్పిగా ఉంటే రెండు చుక్కల జిరేనియమ్ నూనె, రెండు చుక్కల రోజ్ మేరీ నూనె మరియు ఒక చుక్క అల్లం నూనెను కలుపుకోండి. ఇందులో ఒక చెంచా వెజిటబుల్ నూనె కలపండి.
ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట మాలిష్ చేయండి. దీంతో నొప్పి మటుమాయం అంటున్నారు వైద్యులు.