కొందరికి చెమట అధికంగా వస్తుంటుంది. దీంతో శరీరంలోంచి విపరీతంగా చెమట వాసన వస్తుంటుంది. ఇలా చెమట వాసననుండి విముక్తి కలగాలంటే బబూల్ ఆకులను రుద్ది శరీరానికి పూయండి.
ఆ తర్వాత చిన్న పసుపు ముక్కను పేస్ట్‌లా రుబ్బుకుని శరీరానికి పూయండి. ఆ తర్వాత స్నానమాచరించండి. ఇలా కొద్దిరోజులపాటు చేస్తుంటే శరీరంనుంచి చెమట ద్వారా వచ్చే దుర్వాసన మటుమాయమవుతుంది.
పొడి దగ్గుతో బాధపడుతుంటే...!
పొడి దగ్గుతో బాధపడుతుంటే బబూల్ చెట్టునుంచి తీసిన జిగురు ముక్కను నోట్లో వేసుకోండి. దీంతో పొడి దగ్గుబారిన పడినవారికి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.