బాలింతలకు అధిక రక్తస్రావం ఇబ్బంది పెడుతుంటే కొబ్బరి పువ్వు జ్యూస్‌ను తీసుకుంటే సత్వర ఉపశమనం దొరుకుతుంది. కొబ్బరి కాయ లోపల పువ్వు వస్తుంది. అది గర్భాశయానికి మేలు చేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
నిత్యం కొబ్బరినీళ్లు తాగితే మూత్రపిండాల సమస్యలు దరిచేరవు. శరీరానికి చల్లదనం లభిస్తుంది. గొంతు మంట, నొప్పిగా ఉన్నప్పుడు కొబ్బరిపాలు తాగితే సరిపోతుంది.
కొబ్బరి నూనెలో యాభై శాతం లారిక్ ఆమ్లం ఉంటుంది. దీన్ని వంటల్లో అధికంగా ఉపయోగిస్తే గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కొవ్వుశాతం పెరగదు. రక్తపోటు నియంత్రణలో ఉంటుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.
పచ్చికొబ్బరిలో పోషకవిలువలు అధికంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు అమృతంలా పనిచేస్తాయంటున్నారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, బీ, సీ రిబోఫ్లోవిన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.