అన్ని కాలాల్లో, అన్ని ప్రాంతాల్లో లభించే మహత్తరమైన ఓషధి వేప. ఇది చర్మ రోగాలు, పేగుల్లో చేరిన పురుగులు, మధుమేహం, ఆర్శమొలలు వంటివాటికి ఔషధిగా పనిచేస్తుంది.
మొటిమలున్నప్పుడు వేప చెక్క పొడి, రక్త చందనం పొడి, పెరుగు సమ భాగాలుగా కలిపి ముఖానికి లేపన చేయాలి. కామెర్లతో బాధపడుతున్నప్పుడు వేప చిగుళ్ల ముద్ద ఒక భాగం, చింతాకు ముద్ద రెండు భాగాలను కలిపి పరగడుపున ఉసిరికాయంత ముద్దను మింగి పాలు తాగితే ఫలితం కనిపిస్తుంది.