సాధారణంగా ఫ్లూ లక్షణాలంటే ముక్కు కారడం, దగ్గు, జలుబుతో బాధపడటంలాంటిది. వీటిని మందులతో త్వరగా తగ్గించలేము. శరీరంలో ఫ్లూ సోకినప్పుడు జ్వరంతోపాటు కండరాలు, కీళ్ళ నొప్పులు బాధపెడుతుంటాయి. ఫ్లూ వైరస్ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పూర్తిగా బలహీనపరుస్తుంది.
కాబట్టి సాధారణంగా తీసుకునే ఆహారంలోనే పౌష్టికాహారం తీసుకోవడం చాలా ఉత్తమమంటున్నారు ఆరోగ్యనిపుణులు. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో విటమిన్ సి కలిగిన ఫలాలు తీసుకోవాలి.
విటమిన్ సిలోని యాంటీ హిస్టమినిక్ గుణాల మూలంగానే ఇది సాధ్యమౌతుందని పరిశోధకులు చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మజాతి పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.