పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » అనాస పండుతో ఆరోగ్యం (Pineapple | Protiens | Health | Vitamin C | Digetion)
Feedback Print Bookmark and Share
 
అనాసపండులో అనేక రకాలైన పోషక విలువలున్నాయి. ఆరోగ్యరక్షణకి అవసరమయిన విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న పండు అనాసపండు. ఈ పండును తింటే శరీరంలోని జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.

ఇందులోనున్న పోషక విలువలేంటో తెలుసుకుందాం:

ఒక అనాసపండులో 12 మి.గ్రా విటమిన్‌ సి, 160 మైక్రో మి.గ్రా పొటాషియం, 89శాతం తేమ, 1 గ్రా పిండిపదార్థాలు, 0.2 శాతం కొవ్వు ఉన్నాయి.

అనాసపండు తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలేమిటంటే...

పండిన అనాస పండు తింటూంటే పళ్ళనుండి రక్తంకారే స్కర్వీ వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని అనాసరసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

జ్వరం, కామెర్లవంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాసరసం ఇవ్వడం ఎంతో మంచిది. అనాసపండులో ఉండే కొన్ని పదార్థాలు శరీరంలో క్యాన్సర్‌ కారకమయిన పదార్థాలు తయారు కాకుండా, పేరుకుపోకుండా రక్షణనిస్తాయంటున్నారు వైద్యులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.