** ఇంట్లో చిన్న పిల్లలుంటే ముఖ్యంగా చలి కాలంలో బాదం పప్పులు ఇంట్లో ఉంచండి. ప్రతి రోజు రాత్రిపూట రెండు-నాలుగు బాదం పప్పులు ఉడకబెట్టి దానిని రుద్దుకోండి. ఈ రుద్దుకున్న బాదం పప్పులను పాలలో కలిపి ఇస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు. దీంతోపాటు వారి చర్మసౌందర్యం మరింత ఇనుమడిస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుంది.
** వేడి పాలలో బాదంపప్పులను ఉడకబెట్టి సేవిస్తే జలుబు, దగ్గు తొలగిపోయి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చలికాలంలో గోధుమపిండిని నెయ్యిలో వేంచి అందులో బాదంపప్పులు, కిశ్‌మిస్, పిస్తా, ఏలకలు, పొడి చేసి చక్కెరతోపాటు కలిపి ఉంచుకోండి. ఈ మిశ్రమాన్ని లడ్డూ, హల్వాగా తయారు చేసుకుని పిల్లలకు ఆహారంగా ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారంటచున్నారు ఆరోగ్య నిపుణులు.