** టమోటాలు మంచి రుచికరంగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
** ఉదరానికి సంబంధించిన రోగాలుంటే టమోటాలు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
** త్రేన్పులు, కడుపు ఉబ్బరంగా ఉండటం, నోట్లో పొక్కులు రావడంలాంటివి ఉంటే టమోటా సూప్ తయారు చేసుకుని అల్లం, నల్ల ఉప్పు కలుపుకుని సేవించండి. దీంతో ఉపశమనం కలుగుతుంది.
** టమోటా సూప్‌ను సేవిస్తుంటే శరీరంలో కొత్త శక్తి పుట్టుకొస్తుంది. కడుపు తేలికగా ఉంటుంది.
** చలికాలంలో టమోటా సూప్ సేవిస్తే జలుబు సంబంధిత వ్యాధులు దరిచేరవు.
** అతిసారం, అపెండిసైటిస్‌లాంటి వ్యాధులతో సతమతమయ్యేవారు టమోటాలను సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.
** రక్తలేమితో బాధపడేవారు నిత్యం టమోటాలు తింటుంటే మంచి ఫలితాలుంటాయి.
** జ్వరం తర్వాత బలహీనంగా ఉంటుంది. అలాంటప్పుడు టమోటాలను సేవిస్తే మంచి ఫలితాలుంటాయి. దీంతో బలహీనం పారిపోతుంది.
** మధుమేహం వ్యాధితో బాధపడేవారికి టమోటాలు అత్యంత శ్రేష్టకరమైన ఔషధం.