పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » మునగాకుతో ఆరోగ్యం... (Vegetables | Health | Joint Pains | Blood | Hemoglobin deficiency)
Feedback Print Bookmark and Share
 
** మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

** మునగాకు కాడ నుంచి తీసిన రసాన్ని గాయాలకు రాస్తే యాంటి సెప్టిక్‌గా గాయాలను నయం చేస్తుంది.

** మునగాకు నూరి ఆ ముద్దను కురుపులపై కడితే అవి నయం అవుతాయి. చిన్న దెబ్బలకు, బెణుకులకు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

** మునగాకు రసం, ఉప్పు కలిపిన రసం కొద్దిగా సేవిస్తూ ఉంటే అజీర్ణం తగ్గిపోతుంది.

** ఒక చెంచా మునగాకు రసంలో కొద్దిగా తేనె కలిపి, రోజూ నిద్రపోయే సమయంలో తాగితే రేచీకటి తగ్గిపోతుంది.

** ఒక చెంచా మునగాకు రసంలో కొంచెం తేనె కలిపి, దానిని ఒక గ్లాసు లేత కొబ్బరి నీరును కలిపి తీసుకుంటే కలరా, విరేచనాలు తగ్గుతాయి.

** మునగాకును పాలలో కాగపెట్టి, ఆ పాలను తాగుతూ ఉంటే వీర్యవృద్ధి కలుగుతుంది.

** మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా తాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది.

** మునగాకు రసంలో కొంచెం నిమ్మరసం వేసి తాగితే ఆకలి పుడుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.