ఎర్రటి యాపిల్ పండులోనున్న ఫ్లేవోనాయిడ్ తత్వం వలన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొదిస్తుంది.
దీంతో మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా ఆరోగ్యంగాను ఉంటుంది. యాపిల్ పండ్లలో శరీరానికి కావలసిన ప్రొటీన్లు, విటమిన్లు సమపాళ్ళల్లో ఉంటాయి. అలాగే క్యాలరీలను తగ్గిస్తుంది.
శరీరంలోని క్యాలరీలను తగ్గించడంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక రక్తపోటును నివారిస్తుంది. ఇతర సమస్యలను దరిచేరనీయదు. కొందరు ఆరోగ్యంగా ఉండాలని ఉప్పును తగ్గిస్తుంటారు. అలాంటి వారికి యాపిల్ పండు దివ్యౌషధంగా పనిచేస్తుంది.