పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » "పండ్ల" రసాలతో ఆరోగ్యం (Home Remedies | Fruit Juices | Carrot | Apple | Ginger | Gourd | Cancer | Orange | Pineapple |)
Bookmark and Share Feedback Print
 
Juice
FILE
* ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లతో తయారు చేసే రసాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే శుభ్రమైన పండ్లనుంచి రసం తీసి, దానికి ఇతర పదార్థాలేమీ కలుపకుండా అలాగే స్వచ్ఛంగా తీసుకోవటంవల్ల పోషకాలు శరీరానికి మెండుగా అందుతాయి. తీపి కావాలనుకునేవారు కాస్తంత చక్కెరను మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. వీలయితే పండ్ల రసాలను అలాగే స్వీకరించటం ఉత్తమం.

* క్యారెట్, ఆపిల్, అల్లం రసాలను తీసుకోవటంవల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గుమ్మడి, ఆపిల్ రసాలతో క్యాన్సర్‌ను నిరోధించవచ్చు. ఈ రసాలు కొలెస్ట్రాల్‌ను అదుపులో పెట్టడమేగాకుండా.. కడుపునొప్పి, తలనొప్పిలను తగ్గిస్తాయి. ఆపిల్, కాకర రసాలు నోటి దుర్వాసనను పోగొట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. శరీరంలో మంటలను తగ్గిస్తాయి.

* కమలా పండ్ల రసం, అల్లం, గుమ్మడి రసాలతో చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తాయి. ఫైనాఫిల్, ఆపిల్, పుచ్చకాయ రసాలను తీసుకోవటంవల్ల పొత్తికడుపుకు, కిడ్నీలకు చాలా మంచిది. ఆపిల్, గుమ్మడి, కివీపండు రసాలను పుచ్చుకుంటే చర్మ సౌందర్యం ద్విగుణీకృతం అవుతుంది.

* బీరకాయ, అరటిపండు రసాలు శరీరంలోని చక్కెర స్థాయిని తగ్గించటంలో ఉపయోగపడతాయి. క్యారెట్, ఆపిల్, బీర, మామిడికాయ రసాలు శరీరంలో వేడిని, రక్తపోటును తగ్గిస్తాయి. ద్రాక్ష, పుచ్చకాయ రసాలతోపాటు విటమిన్ సి, బీ2 విటమిన్ అధికంగా లభించే పండ్ల రసాలను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే కణాలు చురుకుగా పనిచేస్తాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.