పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » అధిక బరువును ఇట్టే తగ్గించే "ఖర్బూజా" (Home Remedies | Kharbooja | Summer | Heavyweight | Potassium | Blood Pressure | Fiber | Folic Acid)
Bookmark and Share Feedback Print
 
Home Remedies
FILE
* వేసవిలో వేడిగాలులు, దప్పిక నుంచి శరీరాన్ని రక్షించే గుణం గల ఖర్బూజా పండు అధిక బరువును తగ్గించటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు రాత్రిపూట భోజనం మానివేసి ఓ వంద లేదా రొండొందల గ్రాముల వరకు ఖర్బూజా ముక్కలను సలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

* ఖర్బూజాలో లభించే కెలోరీలు శరీరానికి శక్తిని అందిస్తే, పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచటం, మూత్రపిండాల్లో రాళ్లు తయారు కాకుండా ఆపటం లాంటివి చేస్తుంది. పీచు అధికంగా లభించే ఈ పండును కొద్దిగా తిన్నా, కడుపునిండా తిన్న భావన కలుగుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించటంలో ఖర్బూజా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

* ఖర్బూజా పండులో లభించే విటమిన్ ఏ కంటిచూపు మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్ సీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి గుండెనొప్పి, క్యాన్సర్ లాంటి రోగ కారకాలపై పోరాడుతుంది. ఈ పండులోని ఫోలిక్ ఆమ్లం గర్భిణులకు వరం లాంటిదే. ఇక బాలింతలు ఈ పండును తీసుకోవటంవల్ల పాలు బాగా పడతాయి. చర్మంపై దురదలు, ఎగ్జిమా కలిగినవారికి ఈ పండు ఓ మంచి ఔషధం అని చెప్పవచ్చు.

* ఖర్బూజా రసాన్ని ప్రతిరోజూ తీసుకోవటంవల్ల ఎసిడిటీ, అల్సర్లనుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ పండు తొక్కను కషాయంలా చేసి కొబ్బరినీటితో కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు మాయమవుతాయి. వీటి గింజలను ఆహారంతోపాటు తీసుకుంటే శరీరం బరువు పెరుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.