పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » కడుపులో మంటా..? అవునండీ అవును..!! అయితే... (Keera | Health | Blood pressure | Potassium)
Bookmark and Share Feedback Print
 
FILE
కీరదోస, మామూలు దోస రెండూ మనకు మేలు చేస్తాయి. రక్తపోటులో తేడా ఏర్పడినవారికి దోసకాయ తినడం మంచిది. అందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చుతగ్గులను సవరిస్తుంది. దోసలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి.

కళ్లకింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించగలవు. కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి.

శిరోజాల ఎదుగుదలకు కీర మంచిదే. అందులోని సల్ఫర్, సిలికాన్ శిరోజాలకు ఆరోగ్యాన్నిస్తాయి. దోస రసం కడుపులో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

దోసను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో ఉంది. దోసకాయను ఊరగాయగా తినకూడదు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.