పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » మీ నడుము నాజూకుగా మారాలంటే... (Health | Home Remedies | Waist | Over Weight)
WD
మన శరీరంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరం బరువు పెరిగి, అందవికారంగా ఉండటమే కాకుండా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో కొవ్వు చేరటం వల్ల, షుగర్ వ్యాధి, రక్తహీనత, అజీర్తి ఇంకా ఇతర సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల అధిక బరువును నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రింది వాటితో అధిక బరువును నియంత్రించే అవకాశం ఉంది.

మిరియాలు
ప్రస్తుతం మనం ఆహారంలో మిరియాలను వాడటం తగ్గంచాం కానీ ఇంతకుముందు మన పూర్వీకులు ఆహారంలో మిరిపకాయలకు బదులుగా మిరియాల పొడినే వాడేవారు. మిరియాల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రోటీన్‌లు ఉన్నాయి. ఈ మిరియాలు జీర్ణశక్తిని పెంచడానికి సహాయం చేస్తాయి. మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను శరీరంలోని అన్ని భాగాలకు అందేలా చేస్తుంది. ఇంకా మిరియాల్లో ఉండే పిపరిన్ రసాయనం శరీరంలోని జీవక్రియలను ఉత్సాహపరుస్తుంది. ఇంకా తాజా మిరియాల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సుగంధ ద్రవ్యాల వల్ల శరీరంలోని కొవ్వు పదార్థాలు క్రమక్రమంగా తగ్గి, శరీరపు బరువును అదుపులో ఉంచుతుంది. కనుక ఆహారంలో మిరియాలకు చోటివ్వాలి.

దాల్చినచెక్క
మీ ఆహారంలో సరిపడినంత దాల్చిన చెక్క పొడిని తీసుకుంటే మీ బరువు తగ్గిందన్నమాటే. ఆరోగ్యమే కాకుండా మీ అందాన్ని కూడా పెంచుతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. రక్తంలోని గ్లూకోజ్‌, కొలెస్ట్రాల్‌ని 27% వరకు తగ్గించే శక్తి ఈ దాల్చినచెక్కకు ఉంది. మధుమేహంలోని రెండో రకానికి చెందిన వ్యాధితో భాధపడేవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా రక్తాన్ని గడ్డకట్టకుండా కాపాడుతుంది. అలా అని దాల్చిన చెక్కను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే లివర్ పాడవుతుంది. జాగ్రత్త సుమా...

ఆవాలు
శరీరంలోని బరువును తగ్గించే పనిలో ఆవాలది మూడవ స్థానం. ఆవాలు కూడా శరీరంలోని జీవక్రియలను ఉత్సాహపరుస్తుంది. దీనివల్ల శరీరంలోని వివిధ బాగాల్లో ఎక్కువగా ఉన్న కొవ్వు పదార్థాలు వేగంగా కరగడం మొదలవుతుంది. మీ శరీర బరువు సులభంగా తగ్గుతుంది. రోజూ ఒక స్పూన్ ఆవాల పిండిని తీసుకుంటే 25% వరకు జీవక్రియలు ఉత్తేజం చెందుతాయని ఇటీవలే ఇంగ్లాండులోని ఆక్స్‌ఫర్డ్ పాలిటెక్నిక్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తెలిసింది. రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి దాన్ని తగ్గించడానికి ఆవనూనె బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆవనూనెలో చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ఇవే కాక ఇంకా ఇందులో ఐరన్, మాంగనీస్, జింక్, ప్రోటీన్, కాల్షియం, నయసిన్ లాంటివి ఉన్నాయి.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia