పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » కడుపులో మంటా... దోసకాయ రసం తాగండి..!! (Stomack | Cucumber | Health)
WD
కొంతమంది కడుపులో మంటతో సతమతమవుతుంటారు. ఈ మంట తగ్గేందుకు ఏవేవో మాత్రలను మింగుతుంటారు. కడుపులో మంటగా ఉన్నప్పుడు దోసకాయ రసాన్ని తాగితే ఆ మంట తగ్గుతుంది. అంతేకాదు... దోసకాయకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉన్నది. దోసకాయను తొక్కుతో తినడం మంచిది. అయితే ప్రస్తుతం ఏ కూరగాయలను పండించేందుకైనా రసాయన ఎరువులు వాడుతున్నారు కనుక సహజసిద్ధమైన కాయలను మాత్రమే తొక్కుతో తినాలి.

దోస తొక్కలో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో ఉంది. అయితే దోసకాయను ఊరగాయలా తినకూడదు. కీరదోస, మామూలు దోస రెండూ మనకు మేలు చేస్తాయి. రక్తపోటులో తేడా ఏర్పడినవారికి దోసకాయ తినడం మంచిది. అందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చుతగ్గులను సవరిస్తుంది. దోసలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి.

కళ్ల కింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించగలవు. కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కల్ని కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి. శిరోజాల ఎదుగుదలకు కీర మంచిదే.
సంబంధిత సమాచారం
Feedback Print