ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > వార్తలు
 
ఆరురోజుల శిశువుకు పేస్‌మేకర్
దేశ వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఆరు రోజుల శిశువుకు పేస్‌మేకర్‌ను పూనేలోని జహంగీర్ ఆసుపత్రి వైద్యులు అమర్చారు. ఇటువంటి పరిస్థితిని అప్పుడే పుట్టిన శిశువులు ఎదుర్కొనడం చాలా అరుదైన విషయంగా జహంగీర్ ఆసుపత్రి హృద్రోగ విభాగాధిపతి డాక్టర్ జేఎస్ దుగ్గల్ మీడియాతో అన్నారు.

గుండె యొక్క పంపింగ్ రేటును నియంత్రించే హృదయ కండర వ్యవస్థలో తలెత్తిన వైఫల్యంతో శిశువులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారని దుగ్గల్ తెలిపారు. దీంతో గుండెలో అవరోధం చోటు చేసుకోవడంతో ఆరురోజుల శిశువుకు తొలుత వెంటిలేటర్‌‌ను అమర్చినట్లు వెల్లడించారు.

అయినప్పటికి శిశువు ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు చోటు చేసుకోకపోవడంతో శాశ్వత పేస్‌మేకర్‌ను శిశువుకు ఏర్పాటు చేసినట్లు దుగ్గల్ పేర్కొన్నారు.
మరిన్ని
సెల్‌ఫోన్ల వాడకం: పెరుగుతున్న బ్రెయిన్ క్యాన్సర్
మదుమేహ వ్యాధిగ్రస్తులలో కొత్త ఆశలు
ఏడాదికి 30వేల రాబీస్ వ్యాధిగ్రస్థుల మృతి
కొల్‌కతాలో 85 శాతం మంది అసిడిటీ బాధితులు
1.80 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య కార్డుల పంపిణీ
భారత్‌లో సగానికి తగ్గిన హెచ్‌ఐవీ రోగుల సంఖ్య