ఆస్ట్రేలియాలోని ప్రభుత్వ ఆసుపత్రుల దయనీయమైన దుస్థితిని, సామాన్య ప్రజలకు అందుబాటులో లేనివైనాన్ని ఆస్ట్రేలియా వైద్య సమాఖ్య (ఏఎమ్ఏ) తన వార్షిక నివేదికలో ప్రధానంగా ప్రస్తావించింది. గత 20 సంవత్సరాల కాలంలో ఆస్ట్రేలియాలోని ప్రభుత్వ ఆసుపత్రులలోని కనీస వసతులు 60 శాతం క్షీణించిపోయాయని ఏఎమ్ఏ పేర్కొంది.
అత్యున్నతమైన సాంకేతిక సదుపాయాలతో కూడిన ప్రైవేటు ఆసుపత్రుల రాకతో ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య తగ్గిపోయిందని తెలిపింది. తాజా పరిణామాలతో ప్రభుత్వ ఆసుపత్రులలో పడకల సంఖ్య తగ్గిపోవడమే కాక రోగుల ఆరోగ్యం పట్ల సిబ్బందిలో శ్రద్ధ లోపించిందని ఆందోళన వ్యక్తం చేసింది.
అత్యవసర వైద్యసేవల కోసం వచ్చే రోగులు సుధీర్ఘకాలంపాటు పడిగాపులు పడవలసి వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు లోపభూయిష్టంగా మారడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి బాధ్యత వహించాలని ఏఎమ్ఐ విజ్ఞప్తి చేసింది.
|