ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > వార్తలు
 
దేశంలో తొలి ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ "ట్రూత్ ల్యాబ్స్"
భారతదేశపు తొలి ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ హైదరాబాద్‌లో ఏర్పాటు గావించబడింది. డీఎన్ఏ పరీక్షలు తదితర సౌకర్యాలతో నేరాలను పరిష్కరించడంలో నేర పరిశోధక ఏజెన్సీల భారాన్ని చాలా వరకు తొలగించే దిశగా ట్రూత్ ల్యాబ్స్‌ను నిర్మించినట్లు రాష్ట్ర పోలీసు విభాగం మాజీ ఐజీ కేపీసీ గాంధీ తెలిపారు.

డీఎన్ఏ పరీక్షలకు అదనంగా వేలిముద్రలను పోల్చడం, కంప్యూటర్ ద్వారా నేర అధ్యయనం, ప్రతులు మరియు చేతిరాత, నేరం జరిగిన ప్రాంతంలో దొరికిన ఆధారాలకు రసాయన మరియు భౌతిక పరీక్షలను ట్రూత్ ల్యాబ్స్‌లో నిర్వహిస్తామని గాంధీ పేర్కొన్నారు. తమ ల్యాబ్ ద్వారా పోలీసులు, న్యాయస్థానాలను ఆశ్రయించకుండానే అనేక వివాదాలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు.

తాము అందిస్తున్న అధునాతన పరీక్షలు దేశంలో కేవలం కొన్ని ప్రభుత్వ ల్యాబరేటరీలలో మాత్రమే లభిస్తున్నదని గాంధీ వెల్లడించారు. దేశంలో ప్రపధమంగా ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (ఏపీఎఫ్‌ఎస్ఎల్) ఆవిర్భావం వెనుక కేపీసీ గాంధీ అవిరాళ కృషి దాగి ఉంది.
మరిన్ని
పిల్లలకు తప్పని క్యాన్సర్ వ్యాధి
అధ్వాన్నస్థితిలో ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆసుపత్రులు
ఆరురోజుల శిశువుకు పేస్‌మేకర్
సెల్‌ఫోన్ల వాడకం: పెరుగుతున్న బ్రెయిన్ క్యాన్సర్
మదుమేహ వ్యాధిగ్రస్తులలో కొత్త ఆశలు
ఏడాదికి 30వేల రాబీస్ వ్యాధిగ్రస్థుల మృతి