ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > వార్తలు
 
రెండు లైంగిక అవయవాలతో జన్మించిన బాలుడు
వైద్యచరిత్రలో అరుదుగా సంభవించే రీతిలో రెండు లైంగిక అవయవాలను కలిగిన బాలుడు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో జన్మించాడు. అదనపు అవయవాన్ని మినహాయిస్తే శిశువు ఆరోగ్యానికి ఢోకా లేదని వైద్యులు తేల్చి చెపుతున్నారు.

జైపూర్‌కు చెందిన 35 సంవత్సరాల వయస్సు గల మహిళకు తొమ్మిదవ సంతానంగా పోయిన గురువారం ఆసుపత్రిలో జన్మించిన బాలుడు, ఒకదానిపై ఒకటిగా అమరినట్లుగా ఉన్న రెండు లైంగిక అవయవాలను కలిగి ఉన్నాడని డెలివరీ నిర్వహించిన గైనకాలజిస్ట్ అభా శ్రీవాస్తవ తెలిపారు.

ఇటువంటి అరుదైన పరిస్థితులను కలిగిన శిశువులు ప్రపంచవ్యాప్తంగా 100 మంది జన్మించగా, వారిలో భారతదేశానికి చెందిన వారు ముగ్గురని శ్రీవాస్తవ పేర్కొన్నారు. బాలుని కిడ్నీలతో పాటు ఇతర అవయవాలకు వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించగా, సాధారణమైన ఆరోగ్యంతో బాలుడు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఆమె వెల్లడించారు.

బాలుని అదనపు అవయవాన్ని వైద్యపరిభాషలో 'కాంజినైటల్ ఎనోమోలీ'గా పేర్కొంటారని అభా తెలిపారు.
మరిన్ని
సర్వరోగ నివారణి 'నోని': వైద్యనిపుణులు
దేశంలో తొలి ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ "ట్రూత్ ల్యాబ్స్"
పిల్లలకు తప్పని క్యాన్సర్ వ్యాధి
అధ్వాన్నస్థితిలో ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆసుపత్రులు
ఆరురోజుల శిశువుకు పేస్‌మేకర్
సెల్‌ఫోన్ల వాడకం: పెరుగుతున్న బ్రెయిన్ క్యాన్సర్