మాదక ద్రవాల పరీక్షలలో ప్రతివారం 18 మంది సైనికులు వాటిని వినియోగిస్తున్నట్లు తేలుతున్నదని రక్షణ శాఖ అందించిన సమాచారం వెల్లడిస్తోంది. 2003 సంవత్సరంలో ఇరాక్ యుద్ధం తలెత్తిన నాటి నుంచి సైనికదళాలలో కొకైన్ వాడకం వృద్ధి చెందసాగింది. 2006 ఆరంభం నుంచి జరిపిన మాదకద్రవ్యాల పరీక్షలో 1500 సైనికులు వాటిని వినియోగిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది.
80 శాతం మంది సైనికులు క్లాస్ ఏ మాదకద్రవ్యాలను వాడుతున్నట్లు మంత్రిత్వ శాఖ తరుచుగా నిర్వహించే మాదకద్రవ్యాల పరీక్షలలో తేటతెల్లమయ్యింది. గడచిన సంవత్సరకాలంలో మత్తుపదార్ధాలకు బానిసలైన బ్రిటన్ సైనికుల సంఖ్య 48 శాతం పెరిగింది.
అనుక్షణం మృత్యువు వెంటాడుతున్న నేపథ్యంలో ఆ మానసిక భావన నుంచి బయటపడేందుకు రక్షణ బలగాలు మత్తు పదార్ధాలకు అలవాటు పడుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు.
|