డార్క్ చాక్లెట్లను తీసుకునేవారు, తరచుగా దాంపత్య సుఖాన్ని అనుభవించేవారిలోనూ బ్రెయిన్ పవర్ మెండుగా ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. మెదడు... దాని సమర్థతలపై పరిశోధనలు చేసిన ఓ అధ్యయన బృందం వెల్లడించిన వివరాల ప్రకారం... చాక్లెట్లు తినేవారు, సెక్స్‌లో ప్రతిరోజూ పాల్గొనేవారిలో మెదడు పనితీరు చురుకుగా ఉండటమే కాక జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు తేలింది.
ముఖ్యంగా సెక్స్ విషయానికి వస్తే... సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఏడు రకాలైన రసాయనిక మార్పులు సంభవించి, మెదడు పనితీరు మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది. ఆక్సిటోసిన్ రసాయన స్థాయిలు పెరగటం ద్వారా మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందని బృందం వెల్లడించింది.
ఇక డార్క్ చాక్లెట్‌లో ఉన్న మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ రసాయనాలు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి మెదడుకు జరిగే హానిని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. అంతేకాదు కొవ్వు పదార్థాలను తక్కువగా కలిగి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవటం ద్వారా మెదడు శక్తివంతంగా తయారవుతుందని తేలింది.
అలాగే పొగతాగే అలవాటును మానుకున్నవారిలో జ్ఞాపక శక్తి మెరుగుపడి, మానసికంగా స్థిరంగా ఉండటాన్ని కూడా ఆ అధ్యయనంలో గమనించారు. రోజువారీ తీసుకునే ఆహారం లేదా పానీయాలకు ఒక్కో దానికి ఒక్కో రకమైన విశేష గుణాలుంటాయి. కనుక వాటిని తెలుసుకుని ఆహారాన్ని తీసుకోవాలని పరిశోధకులు అంటున్నారు.
|