తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో ఫోర్టీస్ హెల్త్‌కేర్ సెంటర్ కార్యకలాపాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యారు. ఈ కేంద్రాన్ని భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్, ఐపీఎల్ డెక్కన్ ఛార్జర్స్ జట్టు కోచ్ రాబిన్ సింగ్ ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా చేసుకుని పని చేస్తున్న ఈ సంస్థ చెన్నయ్‌లో మలర్ హాస్పిటల్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఫోర్టీస్ హెల్త్‌కేర్ గుడ్‌లైఫ్ కేంద్రాలు ముంబై, ఢిల్లీ, మొహాలీ, జైపూర్, ఫరిదాబాద్, మారిషెస్, శ్రీలంక తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత రాబిన్ సింగ్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బందిలో క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు వీలుగా మలర్ క్రికెట్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
సాధారణంగా వ్యాధి సోకిన తర్వాత ఆస్పత్రికి వెళ్లేదానికంటే.. ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా, ఆరోగ్యంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ దిశగా ఫోర్టీస్ హెల్త్ కేర్ కృషి చేస్తుందనే ఆశాభావాన్ని రాబిన్ సింగ్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మలర్ హాస్పిటల్ డైరక్టర్ డాక్టర్ వివేక్ తాల్వికర్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.