దేశంలో పెరుగుతున్న హృద్రోగులు: డాక్టర్. పీసీ రెడ్డి
మంగళవారం, 25 ఆగస్టు 2009( 19:10 IST )
Srini
WD
దేశంలో హృద్రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని అపోలో గ్రూప్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నానాటికీ పెరుగుతున్న హృద్రోగుల సంఖ్యను వీలైనంత మేరకు తగ్గించేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే సమయంలో హృద్రోగులను రక్షించేందుకు అపోలో గ్రూపు ఆస్పత్రులు ముందంజలో ఉన్నట్టు ఆయన అన్నారు.
కాగా, దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించే కార్పొరేట్ ఆస్పత్రుల్లో అగ్రస్థానంలో నిలిచిన అపోలో ఆస్పత్రి తాజాగా ఓ సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. పది వేల హార్ట్ బీటింగ్ ఆపరేషన్లను పూర్తి చేసిన కార్పొరేట్ వైద్య సంస్థగా రికార్డులకెక్కింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి, ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ ఎం.ఆర్.గిరినాథ్‌లు మంగళవారం చెన్నయ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
గత 25 సంవత్సరాల అపోలో హాస్పిటల్ చరిత్రలో ఇప్పటి వరకు మొత్తం 25 వేల కరోనరీ బైపాస్ ప్రొసీజర్స్‌ను పూర్తిచేయగా, వీటిలో పదివేల హార్ట్ బీటింగ్ కరోనరీ బైపాస్ సర్జరీ ఆపరేషన్లు ఉన్నట్టు తెలిపారు. కార్డియో కేర్‌లో దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రి ఆపోలో ప్రథమ స్థానంలో ఉందని ఆయన తెలిపారు.
గత 20 సంవత్సరాల్లో అపోలో ఆస్పత్రిలో సుమారు 30 వేల హృద్రోగ ఆపరేన్లను చేసినట్టు చెప్పారు. వీటిలో 22 వేల హృదయ ధమని
Srini
WD
బైపాస్ సర్జరీలు ఉన్నట్టు తెలిపారు. పది సంవత్సరాల క్రితం వరకు ఈ ఆపరేషన్లను హార్ట్ లంగ్ మెషన్ ద్వారా చేస్తూ వచ్చినట్టు చెప్పారు.
ఇటీవలి కాలంలో 90 శాతం కరోనరీ బైపాస్ సర్జరీలను బీటింగ్ హార్ట్ టెక్నిక్స్ ద్వారా చేస్తున్నామన్నారు. ఈ శస్త్ర చికిత్సలకు రోగుల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని, అదే సమయంలో రోగి ఆరోగ్యం కూడా త్వరగా మెరుగు పడుతుందని ప్రతాప్ రెడ్డి వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గిరినాథ్ మాట్లాడుతూ.. ఎప్పటికపుడు అందుబాటులోకి వచ్చే అధునాతన టెక్నాలజీని ఉపయోగించి కార్డియో సర్జరీలను చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన శిక్షణతోపాటు.. విద్యాబోధనను సైతం అపోలో ఆస్పత్రి అందిస్తున్నట్టు చెప్పారు.
అందువల్లే కార్డియో కేర్‌లో అపోల్ అగ్రగామి ఆస్పత్రిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా రెండు దశాబ్దాల క్రితం గుండె ఆపరేష్ చేయించుకున్న కొంతమంది రోగులు తమ ఆరోగ్య విషయాలను వెల్లడించారు.