పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » వార్తలు » ప్లాస్టిక్ సంచుల వాడకం వల్లే కలిగే ముప్పుపై ప్రచారం (Plastic bags | Exnora | Big FM | Chennai |)
 
Srini
WD
పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ సంచుల వాడకం వల్ల కలిగే ముప్పుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెన్నయ్‌లోని ఎక్స్‌నోరా ఇంటర్నేషనల్ సంస్థ విన్నూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రైవేట్ రేడియో ఛానల్ బిగ్ ఎఫ్ఎంతో ఒక అవగాహన కుదుర్చుకుంది. ఈ అవగాహన మేరకు.. ప్రాస్టిక్ సంచుల వాడకం వల్ల కల్లే నష్టాలను బిగ్ ఎఫ్ఎం రేడియోలో ప్రసారం చేస్తారు.

ఈ విషయంపై శనివారం చెన్నయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చెన్నయ్ కార్పొరేషన్ మేయర్ ఎం.సుబ్రమణియన్, ఎక్స్‌నోరా ఇంటర్నేషనల్ ఛైర్మన్ బీఎం.నిర్మల్, ఎమ్మెల్యే, నటుడు ఎస్వీశేఖర్, బిగ్ ఎఫ్ఎం జాకీలు పాల్గొని, ప్లాస్టిక్ సంచలు వాడకం వల్ల కలిగే నష్టాలను మీడియాకు వివరించారు. అంతేకాకుండా ఈ సంచుల స్థానంలో కాగితపు సంచులను వాడకం పెంచేలా నగర వాసుల్లో అవగాహన కల్పించేందుకు మీడియాతో పాటు.. ప్రతి ఒక్కరు కృషి చేయాలని మేయర్ సుబ్రమణియన్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక రోజులో సరాసరిగా 323 ప్లాస్టిక్ సంచులను మనం ఇంటికి తీసుకెళుతున్నట్టు చెప్పారు. ఈ ప్లాస్టిక్ సంచులు పూర్తిగా నశించి పోయేందుకు పట్టే కాలం 450 సంవత్సరాలు అవుతుందన్నారు. వీటిని పూర్తిగా నాశనం చేసేందుకు 500 సంవత్సరాలు అవుతుందన్నారు. చెన్నయ్‌లో ఉత్పత్తి అవుతున్న పది శాతం వస్తువుల్లో ఒక శాతం ప్లాస్టిక్ వస్తువులన్నారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.