ఇటీవలికాలంలో అపుడే పురుడు పోసుకున్న పసి కందుల్లో రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూర్ ఎక్కువగా కనిపిస్తోందని రాధాత్రి నేత్రాలయకు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ వసమతి వేదాంతం అన్నారు. చిన్నారుల్లో ఆర్.ఓ.పి అనే అంశంపై ఆమె చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో అమెరికా వంటి ప్రాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ వ్యాధి ప్రస్తుతం భారత్ వంటి దక్షిణాసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తోందని చెప్పారు.
అపుడే పుట్టిన పసి కందుల్లో ఆర్.ఓ.పి ఇది ఎక్కువగా కనిపిస్తోందన్నారు. సాధారణంగా వయస్సు మీదపడిన తర్వాత అంధత్వం రావడం అనేది సహజమన్నారు. అయితే, తల్లిగర్భం నుంచి బాహ్య ప్రపంచానికి వచ్చిన పసి కందుల్లో ఇది కనిపించడం విచారకమన్నారు. దీనివల్ల చిన్నారులు శాశ్వతంగా అంధకారానికి లోనవుతున్నారన్నారు.
అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి "విజన్ 2020"లో దీన్ని చేర్చి, అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సాధారణంగా ఒక చిన్నారి సరిగా చదవలేదడం లేదని తెలిస్తే.. చదువుపై ఎక్కువ ధ్యాస శ్రద్ధ లేదని భావించడం సహజమన్నారు. అయితే, ఇలాంటి విద్యార్థులు ఆర్.ఓ.పికి లోనట్టుగా భావించాలన్నారు.
ఈ విషయాన్ని పలు పాఠశాలల్లో తాము నిర్వహించిన ప్రత్యేక నేత్ర వైద్య శిబిరాల ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. సాధారణంగా ఐదు నుంచి పది సంవత్సరాల లోపు చిన్న పిల్లల్లో ఈ దృష్టిలోపం ఉన్నట్టు తెలియవచ్చిందన్నారు. దీనికారణంగా అనేక మంది చిన్నారులు తమ చదువుల్లో బాగా వెనుకబడుతున్నారని తెలిపారు.
అందువల్ల ఈ లోపాన్ని ఆదిలోనే గుర్తించి, సరైన కళ్ల అద్దాలను ఉపయోగించడం వల్ల ఈ దృష్టిలోపాన్ని సరిచేయవచ్చన్నారు. అంతేకాకుండా, చక్కెర వ్యాధికి లోనైన రోగుల్లో దృష్టిలోపం ఏర్పడుతుందన్నారు. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అని అంటారని డాక్టర్ వసుమతి తెలిపారు. దీని నివారణకు ప్రజల్లో ఎక్కవ అవగాహన కల్పించాల్సి ఉంటుందన్నారు.