పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » వార్తలు » దేశంలో తొలిసారిగా ఐఓఆర్ సేవలు (Tamilnadu | Intelligent Operating Room | Chennai | Parvathi Hospital)
 
FILE
దేశంలోనే తొలిసారిగా ఇంటెలిజెంట్ ఆపరేటింగ్ రూం (ఐఓఆర్)ను ప్రారంభించినట్లు తమిళనాడులోని చెన్నైకి చెందిన పార్వతి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

తమిళనాడులోని చెన్నైలోనున్న ప్రముఖ పార్వతి ఆసుపత్రిలో దేశంలోనే ప్రప్రథమంగా ఐఓఆర్ సేవలను జర్మనీకి చెందిన బ్రెయిన్ ల్యాబ్ సంస్థ సహకారంతో ప్రారంభించినట్లు ఆసుపత్రి ఛైర్మెన్ ఎస్. ముత్తుకుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దేశంలోనే తొలిసారిగా తమ ఆసుపత్రి త్రీడీ ఇమేజ్ సదుపాయాలతో కూడుకున్న ఐఓఆర్ సేవలను జర్మనీకి చెందిన బ్రెయిన్ ల్యాబ్ సహకారంతో తాము ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

ఐఓఆర్ సహాయంతో న్యూరో, ఆర్థోపెడిక్, స్పైనల్ తదితర శస్త్రచికిత్సలను మరింత వేగంగా నిర్వహించవచ్చని ఆయన వివరించారు. దీని ద్వారా చేసే శస్త్రచికిత్సలను మ్యాన్యువల్ సర్జరీలకన్నా కూడా అధిక శాతం విజయవంతమౌతున్నాయని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.