పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » వార్తలు » బ్లడ్ స్టెమ్‌స్టెల్ చికిత్సతో ఆరేళ్ళ చిన్నారికి మరుజన్మ (Thalassemia | Stemcells | Cord blood cell | Lifecell | Health)
 
Srini
WD
వైద్యరంగంలో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. చెన్నయ్‌లోని లైఫ్‌సెల్ సంస్థ బ్లడ్ స్టెమ్‌సెల్స్ చికిత్సా విధానం ద్వారా ఎనిదేళ్ల చిన్నారికి పునర్జన్మను ఇచ్చింది. కోయంబత్తూరుకు చెందిన సెంథిల్ కుమార్ దంపతుల కుమార్తె తామరైసెల్వి థలాసీమియా అనే వ్యాధితో గత ఆరేళ్లుగా బాధపడుతూ వచ్చింది. పుట్టిన ఏడాదిన్నర సంవత్సరం వరకు బాగానే ఉన్న తామరైసెల్వికి ముఖం పాలిపోయినట్టు కనిపించడంతో పాటు.. కళ్లు పచ్చగా మారాయి.

దీంతో వారు వైద్యులను సంప్రదించగా, థలాసీమియా అనే వ్యాధి సోకినట్టు నిర్థారించారు. ఈ వ్యాధి సోకిడంతో ప్రతి నెలనెలలా రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్‌ కూడా రావడంతో చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే, వైద్యుల సలహా మేరకు.. సెంథిల్ కుమార్ దంపతులు మరో బిడ్డకు ప్రయత్నించారు.

వారి ప్రయత్నం ఫలించడంతో సెంథిల్ కుమార్ భార్య గర్భం దాల్చింది. ఆ బిడ్డ రక్త కణాలు పరిశీలించగా, ఆ రక్తంలో థలాసీమియా లక్షణాలు లేవని నిర్థారించుకోవడమే కాకుండా, ఆ రక్తం తామరైసెల్వికి నూటికి నూరు శాతం సరిపోతుందని వైద్య పరీక్షల ద్వారా నిర్ణయించారు. పిమ్మట బిడ్డ జన్మించే సమయంలో బొడ్డు నాళం ద్వారా రక్తాన్ని సేకరించి దాన్ని బ్లడ్ స్టెమ్‌సెల్స్ విధానం ద్వారా వివిధ దశల్లో అనేక పరీక్షలు చేశారు. ఆ తర్వాత స్టెమ్‌సెల్స్‌ను తామరైసెల్వి శరీరంలో ఎక్కించడం, అది పూర్తిగా విజయవంతం కావడంతో చిన్నారి ఆరోగ్యం మెరుగుపడింది.
Srini
WD


దీనిపై లైఫ్‌సెల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ మయూర్ అభయ్ మాట్లాడుతూ.. స్టెమ్‌సెల్స్ విధానం ద్వారా తామరైసెల్వికి నిర్వహించిన చికిత్స విజయవంతం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ విజయం థలాసీమియా వ్యాధితో బాధపడుతున్న అనేక మంది చిన్నారుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తుందన్నారు. ఈ వ్యాధితో ఆరేళ్లుగా బాధపడుతూ వచ్చిన తామరై సెల్వి అనే చిన్నారికి లైఫ్‌సెల్ కొత్త జీవితాన్ని ప్రసాదించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

సాధారణంగా థలాసీమియా వ్యాధితో జన్మిస్తున్న చిన్నారుల సంఖ్య పది వేలకు పైగా ఉందన్నారు. ప్రపంచంలో ఇది పదిశాతంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా థలాసీమియాతో పుడుతున్న ప్రతి ఎనిమిది మందిలో మన దేశంలో ఒకరు జన్మిస్తున్నారని వివరించారు. కాగా, థలాసీమియా చికిత్స విదేశాల్లో రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు అవుతుందన్నారు. అయితే, సెంథిల్ కుమార్ దంపతుల ఆర్థిక స్థోమతను దృష్టిలో ఉంచుకుని దాతలు, పలు ట్రస్టీలు సమకూర్చిన సొమ్ముతోనే చికిత్సను పూర్తి చేసినట్టు లైఫ్‌సెల్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.