కొందరు కాస్త నిద్రలోకి జారుకోగానే గురక పెడుతుంటారు. మీరుగనక గురక పెడుతుంటే కాస్త జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గురక పెట్టేవారికి అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వచ్చే అవకాశం ఉందని ఇండియన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ (ఐఏఓఎన్) హెచ్చరించింది.
తాము మెదడు, మనసు అనే అంశంపై జరిపిన చర్చాగోష్ఠిలో ఈ విషయాలు వెల్లడైనట్లు ఆ సంస్థ పేర్కొంది. శ్వాసకోశ వ్యవస్థలో అడ్డంకి ఏర్పడి శరీరానికి ప్రాణవాయువు (ఆక్సిజన్) సరిగా అందకపోవడంతో గురక వస్తుందని ఐఏఓఎన్ తెలిపింది.