పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » వార్తలు » "మియాట్‌"లో 'అయోటా అనెరిజమ్‌'పై సదస్సు (Miot Hospital | Aortic Aneurysm | Abdomonal Pain | Endovascular | Chest)
 
Srini
WD
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్ శివారు ప్రాంతం నందంబాక్కంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మితమై అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రి మియాట్. ఈ ఆస్పత్రిలో శనివారం నుంచి రెండు రోజుల పాటు.. అయోటా అనెరిజమ్ అనే అంశంపై ప్రత్యేకంగా సదస్సు జరుగుతోంది. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హృద్రోగ నిపుణులతో పాటు.. విదేశాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొంటున్నారు.

ఈ అంశంపై శుక్రవారం ఏర్పాటు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి ఛైర్మన్ మల్లికా మోహన్‌దాస్, ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ వి.వి.బషి, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ కె.మురళిలు మాట్లాడుతూ.. అధిక రక్తపోటు, ధూమపానం, మద్యపానం, జననంతో వచ్చే ఇతర సమస్యలు ఛాతి సంబంధిత వ్యాధులుగా పరిణామం చెందుతున్నట్టు చెప్పారు.

ప్రస్తుతం మన దేశంలో సుమారు ఏడు లక్షల పై చిలుకు మంది హృద్రోగాలతో బాధపడుతున్నారన్నారు. అయితే వీరిలో అతి తక్కువ మందికి మాత్రమే తగిన వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. ప్రధానంగా.. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఏర్పడే అటంకాలు, గురక, అకస్మాతుగా సంభవించి వివిధ రకాల నొప్పులు, దగ్గు, జలుబు, ఆహారపు అలవాట్లలో చోటు చేసుకునే మార్పులు, అధిక ఒత్తిడి, పని బరువు తదితర కారణాల వల్ల హృద్రోగాలు పెరుగుతున్నట్టు చెప్పారు.

ఈ హృద్రోగాలను నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే ఏకైక మార్గమన్నారు. ముఖ్యంగా.. కడుపు నొప్పి క్రమేపీ వెన్నుపూ
Srini
WD
వరకు జరుగుతుందని, దీనివల్ల హృదయ ధమనుల పనితీరుకు ఆటంకం కలుగుతుందన్నారు. ముఖ్యంగా బృహద్ధమని బాగా ఉబ్బి, ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. దీన్నే అయోటా అనెరిజమ్ అని పిలుస్తారని తెలిపారు.

ఇలాంటి శస్త్ర చికిత్సలను తమ ఆస్పత్రిలో అనేక మందికి డాక్టర్ బషి నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసినట్టు వారు వివరించారు. ఇటీవలి కాలంలో దీని బారిన పడే రోగుల సంఖ్య ఎక్కువ అవుతోందన్నారు. ఓపెన్ హార్ట్, బౌపాస్ సర్జరీ చేయించుకున్న హృద్రోగుల్లో ఇది ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

అందువల్లే అయోటా అనెరిజమ్‌పై జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నట్టు వారు వివరించారు. రెండు రోజుల పాటు సాగే సదస్సులో వైద్యులు తారకన్, బర్ట్‌లోమియో, బషీ, అనిల్ బహన్, బాలకృష్ణన్, మురళి, బెడి, చంద్రశేఖర్, రాహుల్ సేథ్, శివకుమార్, అనిల్ భాన్, జార్జ్ జోసఫ్, జ్యోత్స్నా ప్రవీణ్, తదితరులు పాల్గొంటారని డాక్టర్ బషీ వివరించారు. కాగా, విలేకరుల సమావేశంలో ఇటలీలోని అల్‍‌మాంటర్ విశ్వవిద్యాలయ హృద్రోగ విభాగానికి చెందిన డాక్టర్ రాబర్టో డి.బార్‌టోలోమియో కూడా పాల్గొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.