పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » వార్తలు » యోగాతో క్యాన్సర్‌ మటుమాయం: రాందేవ్ (Yoga | Pranayamam | Swainflu | Cancer | Aids | Ramdevbaba | Toranto | Canada)
 
FILE
యోగాలోని ప్రాణాయామంతో స్వైన్‌ఫ్లూ, క్యాన్సర్‌లాంటి మహమ్మారి వ్యాధులను నయం చేసే గుణం ఉందని ప్రముఖ యోగా గురువు స్వామీ రాందేవ్ అన్నారు.

దేశీయ యోగాను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నానని, టోరంటోలో ఓ శాంతి కేంద్రాన్ని స్థాపించాలని ఆయన అన్నారు. సోమవారంనాడు కెనడాలో జరిగిన పియర్సన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

యోగా అనేది ఓ మహత్తరమైన ప్రక్రియ అని, ఇది స్వైన్‌ఫ్లూ, క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి పలు జబ్బులను నయం చేస్తుందని ఆయన వివరించారు.

యోగా అనేది శాస్త్రీయమైనదని, మనిషి తన నిజ జీవితంలో ఆత్మ నియంత్రణ వలన ఎలాంటి వ్యాధినైనా పారద్రోలవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యోగాలోని కొన్ని క్రియలను ఆయన ప్రజలకు చేసి చూపించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.