పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » వార్తలు » డాక్టర్ బాత్రా హెల్త్ క్లినిక్‌కు "మెడికల్ ఎక్స్‌లెన్స్ అవార్డు" (Mukesh Batra | Medical | Thailand | Dy PM | Medicine | India | Healthcare)
Feedback Print Bookmark and Share
 
WD
WD
దేశంలోని హోమియోపతి వైద్యరంగంలో అగ్రగామి ఆస్పత్రిగా పేరుగడించిన డాక్టర్ బాత్రా పాసిటివ్ హెల్త్ క్లినిక్ ప్రైవేట్ లిమిటెడ్‌ వైద్య రంగానికి చేసిన సేవకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ మెడికల్ ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రకటించారు.

న్యూఢిల్లీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టడీస్ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో హెల్త్ క్లినిక్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కమ్ మేనేజింగ్ డైరక్టర్‌ డాక్టర్ ముఖేష్ బాత్రాకు థాయ్‌లాండ్ ఉప ప్రధాని కోర్న్ దెబ్బారాన్సీ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఐఈఎస్ ప్రెసిడెంట్ సచిన్ అధికారి, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అశోక్ హెమల్, పుష్పేంద్ర రాజన్, డాక్టర్ కేకే.పాండే తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాత్రాకు ఇటీవలే ప్రైడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కింది.

బ్యాంకాగ్‌లో జరిగిన ఇండో థాయ్‌ ఎకనామిక్ కోఆపరేషన్ సెమినార్‌లో దీన్ని అందజేశారు. వైద్య రంగంలో తాము చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నతమైన అవార్డు దక్కిందన్నారు. దీంతో తమ కర్తవ్యం మరింత పెరిగిందని డాక్టర్ బాత్రా అభిప్రాయపడ్డారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.