ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » వార్తలు » 15 అక్టోబర్: గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే (Global Hand Washing Day | Pneumonia | Dysentery | Bacteria | October 15th)
** ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులు డయేరియా కారణంగా దాదాపు 272 మిలియన్ స్కూల్ డేస్ నష్టపోతుంటారు.
** ప్రతిసారి భోజనం, అల్పాహారం తీసుకునే సమయానికి ముందుగా సబ్బుతో చేతులు కడుక్కుంటే దాదాపు 44 శాతం డయేరియా బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చంటున్నారు వైద్యులు.
** ప్రపంచవ్యాప్తంగానున్న దేశాల్లో దాదాపు ఇరవై దేశాల్లో కొన్ని మిలియన్ల మంది స్కూల్ విద్యార్థలు అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే( అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం) జరుపుకుంటారు.
** మనం చేతులను కేవలం తినేందుకు మాత్రమే ఉపయోగిస్తామనుకుంటే పొరబడ్డట్టే. ఈ చేతుల్లోనే ఎన్నో మిలియన్ల బ్యాక్టీరియాలు చేరుకునుంటాయి. దీంతో ఈ సూక్ష్మక్రిములు సునాయాసంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
ఈ సూక్ష్మక్రిములే డయేరియా, న్యుమోనియా, కలరా, డీసెంట్రీ తదితర వ్యాధులను వ్యాపింపచేసేందుకు దోహదపడతాయనడంలో సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా అతిసారం వలననే విద్యార్థులు దాదాపు 272 మిలినయన్ల స్కూల్ డేస్‌ను కోల్పోతుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి ఏడాది 12 కోట్ల శిశు జననాలు నమోదవుతుండగా అందులో దాదాపు 15 లక్షల మంది వాంతులు, విరేచనాలచో మృతి చెందుతున్నారని, దీనికంతటికీ కారణం అపరిశుభ్రతేనని యూనిసెఫ్ పేర్కొంది.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా గడగడలాడించిన మహమ్మారి వ్యాధి స్వైన్‌ఫ్లూ వ్యాప్తికి చేతులు పరిశుభ్రంగా లేకపోవడం కూడా ఓ కారణమని వైద్యులు హెచ్చరించిన విషయం విదితమే. దీంతో ఇప్పటికైనా ప్రతి ఒక్కరు చేతులను శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంది.
ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత, దంతధావనం తర్వాత, భోజనానికి ముందు, భోజనం తర్వాత, ఎవరితోనైనా కరచాలనం చేసిన తర్వాత సబ్బుతో మీ చేతులు కడుక్కోవాలి. తరచూ ముఖం, నోరు, పెదవిలాంటి శరీర భాగాలు స్పర్శించకూడదు. ఇలా చేసినా కూడా చేతులు కడుక్కోవాలంటున్నారు వైద్యులు.