ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » వార్తలు » బుద్ధి మాంద్యం కలిగిన పిల్లలకు ఒంటె పాలు (Mentally Retard Children | Camel | Milk | Director | Dr.K.M.L. Pathak)
బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఒంటె పాలు ఆహారంగా ఇస్తుంటే వారిలో బుద్ధి వికసించి మంచిగా మసులుకుంటారని జాతీయ ఒంటెల కేంద్రం డైరెక్టర్ డాక్టర్. కే.ఎమ్.ఎల్. పాఠక్ అన్నారు.
పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లోనున్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ కేంద్రం సహకారంతో బాబా ఫరీద్ సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ సంస్థలోని పిల్లలకు ఒంటె పాలను ఇచ్చి వారిలోనున్న మానసికపరమైన దుర్బలత్వాన్ని పారద్రోలేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. వీరి పరిశోధనల్లో తేలిందేంటంటే పిల్లల మానసిక పరిస్థితిలో మార్పులు సంభవించాయని, వారిలో చాలా మార్పులు వచ్చాయని పాఠక్ వివరించారు.
గడచిన పదిహేను రోజుల్లో బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలకు ప్రతి రోజు ఒంటె పాలు ఇస్తున్నారని, దీంతో మంచి ఫలితాలు వస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థకు చెందిన డాక్టర్. ప్రీత్‌పాల్ సింగ్ తెలిపారు. బ్రెజిల్, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన శాస్త్రజ్ఞుల సూచన మేరకు ఫరీద్‌కోట్ సెంటర్‌లోని బుద్ధిమాంద్యం పిల్లలకు ఒంటె పాలను ఆహారంగా ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఇజ్రాయెల్‌లో జరిపిన పరిశోధనలననుసరించి గోధుమలు లేక వీటితో చేసిన పదార్థాల వలన కొంతమంది పిల్లలకు అలర్జీ సంభవిస్తోందని, అలాగే ఆవు, గేదె పాలతోను ఇదే సమస్య తెలెత్తే పిల్లలకు ఒంటె పాలు ఇస్తే అలర్జీ తొలగిపోతుందని తమ పరిశోధనల్లో తేలినట్లు ఇజ్రాయెల్ పరిశోధకులు తెలిపారు.