ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » వార్తలు » ఫ్రాంటియర్ లైఫ్‌లైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్లోబల్ సదస్సు! (Chennai | Global Events | Lifeline Hospital | Health care | Website)
ఫ్రాంటియర్ లైఫ్‌లైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్లోబల్ సదస్సు!
WD
WD
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఫ్రాంటియర్ లైఫ్‌లైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు అమెరికా మాజీ అధ్యక్షుడు అల్‌గోరే, ఇతర అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో పాటు.. ప్రఖ్యాత వైద్య నిపుణులు పాల్గొననున్నారు.
వచ్చే యేడాది అక్టోబరు 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు 20వ ప్రపంచ కాంగ్రెస్ పేరుతో వరల్డ్ సొసైటీ ఆఫ్ కార్డియో థొరాసిక్ సర్జరీ సదస్సును నిర్వహించనున్నారు. చెన్నయ్ శివారు ప్రాంతమైన చెయ్యారులో ఫ్రాంటియర్ లైఫ్‌లైన్ ఆస్పత్రి 350 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఫ్రాంటియర్ మెడికల్ విలేజ్‌లో జరుగుతుందని ఆ స్పత్రి మేనేజింగ్ డైరక్టర్, సీఈఓ డాక్టర్ కేఎం ఛెరియన్ బుధవారం రాత్రి వెల్లడించారు.
ఈ సదస్సును పురస్కరించుకుని ఒక అధికార పూర్వక వెబ్‌సైట్‌ను బుధవారం రాత్రి తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కె.సుబ్బురాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే యేడాది అక్టోబరులో జరిగిన వరల్డ్ కాంగ్రెస్‌లో తాము భాగస్వాములం కావడం సంతోషదాయకంగా ఉందన్నారు. చెన్నయ్‌లో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పాల్గొనే సదస్సును నిర్వహించడం, అందులో తమిళనాడు ప్రభుత్వం పాలు పంచుకోడం శుభపరిణామన్నారు.
ఈ సదస్సుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. అనంతరం డాక్టర్ కేఎం.ఛెరియన్ మాట్లాడుతూ... తమ ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు ముఖ్యమంత్రి కరుణానిధి పూర్తి సహకారం అందించడం ముహదానందంగా ఉందని ఛెరియన్ తెలిపారు.